అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఏపీలో ఇంటర్మీడియెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.