అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు, రక్షణ శాఖమంత్రి యోవ్ గల్లాంట్‌లపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్టు వారెస్టు జారీ చేసింది. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక చర్యల ఆరోపణలపై ఈఇద్దరికి ఐసీసీ అరెస్టు వారెంట్ ఇచ్చింది. వీరు గాజాలో హత్యలు, హింస, అమానవీయ చర్యలతోపాటు ఆకలిచావుల వంటి యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ ఆరోపించింది. అక్కడి పౌరులకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాపై ఆంక్షలు విధించారని పేర్కొంది. ఇందుకు తగినన్ని ఆధారాలు గుర్తించామని ఐసీసీ తెలిపింది.