అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆరోగ్య సేవల రంగంలో టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తున్న సగిలిటీ ఇండియా (Sagility India) ఐపీవో మంగళవారం ఓపెన్ అయ్యింది. దేశీయ మార్కెట్ల నుంచి రూ.2,107 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో వచ్చిన ఈ కంపెనీ ఐపీవోను సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి 7వ తేదీ వరకు అవకాశం ఉంది. ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ. 28 – రూ. 30 గా నిర్ణయించారు. కనీసం 500 షేర్ల కోసం బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.