Janasena Party : అతను ఒక కిరణం, అతను ఒక పెను తుఫాను, అతని ఆవేశం ఉప్పెన, తన డైలాగ్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. జనం తరుపున కొట్లాడే జనసేనానిగా రాజకీయాలలోకి వచ్చి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పటికే అతను ఎవరో మీకు అర్ధమై ఉంటుంది. మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సరిగ్గా నేటికి జనసేనా పార్టీ పెట్టి 12ఏళ్లు కావడంతో జనసేన ఆవిర్భవ సభ జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో సభని ఏర్పాటు చేశారు. ఈ సభపై అందరి దృష్టి ఉంది. పదవిలో తొలిసారి పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో ప్రసంగించబోతున్నారు.
Janasena Party : ఇది ప్రస్థానం..
పవన్ కళ్యాన్ 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపిస్తున్నట్లుగా ప్రకటించాడు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించి కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో అనే పిలుపునిచ్చాడు. ఈ సభ మంచి సక్సెస్ అయింది. జనసేనా పార్టీ జెండా చేగువేరా విప్లవ స్పూర్తిలా ఉంటుంది. తెల్ల జెండాపై ఆరు మూలాలున్న నక్షత్రం రెడ్ కలర్‌లో గీసి ఉంటుంది. ఇదే సభలో ఆ జెండా కూడా ఆవిష్కరించాడు. పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే ఎన్నికలు రావడంతో 2014 ఎన్నికలలో పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. తెలుగుదేశం కూడా ఎన్డీఏ కూటమిలో ఉండటంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు.
అలా పవన్ తీసుకున్న నిర్ణయం విభజన అంనతరం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడింది. ఆ తర్వాత పవన్, బీజేపీతోపాటు, టీడీపీపైనా విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కాకుండా వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీచేశారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ.. ఘోర పరాజయమైంది. ఒక్క సీటు కూడా గెలపలేకపోయింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం కుప్పలు కుప్పలుగా వచ్చే వారు. ఫలితాల రోజు సీన్ రివర్స్ అయ్యింది. పవన్ కళ్యాణే గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ, టీడీపీ, జనసేనా పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేశాయి. జనసేనకు 21 సీట్లు కేటాయించారు. 100% 21కి 21 స్థానాల్లో విజయం సాధించింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు.