అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ బహిరంగ విచారణ జరుపుతోంది. ఈక్రమంలో శనివారం జరిగిన విచారణకు సీఈ సుధాకర్‌ రెడ్డి హాజరయ్యారు. తనిఖీలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్‌స్టాన్షియల్‌ పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. డీపీఆర్‌ ప్రకారం కాఫర్‌ డ్యాం నిర్మాణానికి డబ్బులు చెల్లించినట్లు స్పష్టం చేశారు. మేడిగడ్డ డిజైన్‌ ఖరారు సమయంలో ఎల్‌ అండ్‌ టీని సంప్రదించినట్లు తెలిపారు. ఈ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని, ప్రాజెక్టులో వరద వేగాన్ని అంచనా వేయకపోవడంతో బ్లాకులు దెబ్బతిన్నాయని సుధాకర్‌ రెడ్డి వివరించారు.