Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అక్కడి హైకోర్టు శుక్రవారం పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తన 17 ఏళ్ల కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక మహిళ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెతో కలిసి యడ్యూరప్ప నివాసానికి సహాయం కోరుతూ వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Advertisement