అక్షరటుడే, వెబ్‌డెస్క్ : శబరిమల వెళ్లే యాత్రికులకు ఉచిత బీమా కవరేజీ వర్తింపజేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన శనివారం జరిగిన మకరవిళుక్కు సమీక్ష సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నారు. శబరిమల ఆలయానికి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తారు. అలాగే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులే ఏర్పాట్లు చేయనున్నారు. కేరళలోని దేవాలయాలను నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్థానం ఈస్పెషల్ బీమా కవరేజీ పథకానికి బీమా ప్రీమియం చెల్లించనుంది. ఈమేరకు కేరళ మంత్రి వీఎన్‌వాసవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.