అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆర్మూర్, నందిపేట్ నాయకులు గురువారం ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆర్మూర్ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పూజా నరేందర్, అల్లూరి గంగాధర్, గుంజాల పృథ్వీరాజ్, నందిపేట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మచ్చర్ల సాగర్‌, రాజన్న, బాల గంగాధర్, సురేందర్ ఉన్నారు.