అక్షరటుడే, భిక్కనూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు షరతులు లేకుండా రూ.2 లక్షల్లోపు రుణాల మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రజా భవన్ ముట్టడికి బయలుదేరిన భిక్కనూరు మండలం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో నాయకులు అత్తేల్లి శ్రీనివాస్, తక్కల రవీందర్ రెడ్డి, దాయారి సాయిరెడ్డి ఉన్నారు.