అక్షరటుడే, బాసర: నిర్మల్‌ జిల్లాలోని ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ భైంసా విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్‌ చేశారు. రెండు రోజుల క్రితం విద్యార్థి స్వాతిప్రియ ట్రిపుల్‌ ఐటీలో ఆత్మహత్య చేసుకోగా మంగళవారం బీఆర్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా భైంసా బీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ రావుల పోశెట్టి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఎంతవరకైనా పోరాడుతామన్నారు.