అక్షరటుడే, ఆర్మూర్: భీమ్ గల్ మండలంలోని బెజ్జోరా, బడా భీమ్ గల్, భీమ్ గల్ కప్పల వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తహశీల్దార్ షబ్బీర్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో కలెక్టర్, సీపీతో పాటు ఆర్మూర్ ఆర్డీవో, ఏసీపీలకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా పోలీస్, మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సయ్య, రవి, మోహిజ్, బోదిరె నర్సయ్య, సతీశ్ గౌడ్, రజాక్, ముత్తెన్న, నవీన్, దుర్గాజి నాయక్, సురేష్, లింబాద్రి, లడ్డు, తదితరులు పాల్గొన్నారు.