అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పట్టణంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కౌసల్య ఆస్పత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలని సీపీఎం నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుగా కొనసాగిస్తున్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్, మోతిరాం నాయక్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.