అక్షరటుడే, కామారెడ్డి: ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తపస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. పీఆర్సీ కమిటీ రిపోర్టును వెంటనే అమలు చేయాలన్నారు. ఈనెల 23న హైదరాబాద్‌లో ధర్మాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ధర్నాలో తపస్ జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.