అక్షరటుడే, వెబ్డెస్క్: Anil Eravatri | రాష్ట్రంలో నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈర్రవత్రి అనిల్ పేర్కొన్నారు. నేతన్నల రుణాలను మాఫీ చేసి వారి ‘రుణం’ తీర్చుకుందని తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.
Anil Eravathri | ఒక్కో నేతన్నకు రూ.లక్ష మాఫీ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కో చేనేత కార్మికుడికి రూ.లక్ష రుణమాఫీ జరుగనుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. సీఎం రేవంత్ నిరంతరం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నారని అనిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్కు ధన్యవాదాలు తెలిపారు.