Ratan Tata | రతన్​ టాటా ఆస్తుల్లో సింహభాగం ఛారిటీకే.. మిగతావి ఎవరికిచ్చారంటే..!

Ratan Tata | రతన్​ టాటా ఆస్తుల్లో సింహభాగం ఛారిటీకే.. మిగతావి ఎవరికిచ్చారంటే..!
Ratan Tata | రతన్​ టాటా ఆస్తుల్లో సింహభాగం ఛారిటీకే.. మిగతావి ఎవరికిచ్చారంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ratan Tata | రతన్‌ టాటా.. ఆయన పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉప్పు నుంచి మొదలు ఉక్కు పరిశ్రమ వరకు వందల కంపెనీలు.. లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించి మహోన్నత వ్యక్తి. ఆయన కేవలం వ్యాపారవేత్తనే కాదు సమాజ సేవకుడు, మనవతామూర్తి.

Advertisement
Advertisement

గతేడాది అక్టోబరు 9న అనారోగ్యంతో రతన్ టాటా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా.. రతన్​ టాటా Ratan Tata మరణానంతరం ఆయన ఆస్తి ఎవరికి చెందుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆయనకు దాదాపు రూ.1‌0వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే వీటిలో సింహభాగం ఆయన ఛారిటీకే ఇచ్చినట్లు సమాచారం. ఆయన వీలునామా లేఖపై తాజాగా ఓ కథనం ప్రచురితమైంది. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Ratan Tata | రూ.3,800 కోట్లు ఛారిటీకే..

రతన్​టాటా Ratan Tata తన ఆస్తుల్లో ఎక్కువగా ఛారిటీకే ఇచ్చినట్లు సమాచారం. ఏకంగా రూ.3,800 కోట్లు తాను నెలకొల్పిన రతన్‌ టాటా ఎండోమెంట్‌ ఫౌండేషన్‌, ఎండోమెంట్‌ ట్రస్ట్‌కు Endowment Trust కేటాయించినట్లు తెలిసింది. అలాగే టాటా సన్స్‌లో తనకున్న వాటాలు, షేర్లు, ఇతర ఆస్తులను విక్రయించాల్సి వస్తే టాటా సన్స్‌లోని వాటాదారులకే అమ్మాలని వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం.

Ratan Tata | కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులకూ..

తన ఆస్తులను కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల పేరిట రాసినట్లు తెలుస్తోంది. తన సోదరీమణుల పేరిట రూ. 800కోట్ల ఆస్తులు రాసినట్లు కథనంలో పేర్కొన్నారు. టాటా గ్రూప్‌ మాజీ ఉద్యోగి, రతన్‌కు సన్నిహితుడైన మోహిన్​కు కూడా రూ.800 కోట్ల విలువైన ఆస్తులు రాసినట్లు సమాచారం. ఇక జుహూలోని బంగ్లాలో షేర్‌తో పాటు కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు తన సోదరుడైన జిమ్మీ నావల్‌ టాటాకు Jimmy Naval Tata ఇచ్చినట్లు తెలుస్తోంది. అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను తన మిత్రుడు మెహిల్‌ మిస్త్రీ పేరిట రాసినట్లు తెలిసింది.

రతన్‌ టాటాకు Ratan Tata మూగజీవాలంటే ఎంత ప్రేమనో అందరికీ తెలిసిందే. అందుకే వాటిని కూడా మర్చిపోకుండా రూ.12 లక్షల నిధులు ఇచ్చారు. రతన్‌ టాటా జీవిత చరమాంకంలో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ student loan చేశారు.

అలాగే పొరుగింటి వ్యక్తికి ఇచ్చిన రూ.23లక్షలు అప్పును కూడా రద్దు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. కాగా.. ఈ వీలునామాను 2022 ఫిబ్రవరి 23న రాసినట్లు కథనం వెల్లడించింది.

Advertisement