అక్షరటుడే, వెబ్డెస్క్ : Vitamin D | దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు విటమిన్ డి లోపంతో vitamin D deficiency బాధ పడుతున్నారు. ప్రతి మనిషికి విటమిన్ డి ఎంతో అవసరం. రోగ నిరోధక శక్తి పెంపుతో పాటు, కండరాలు, ఎముకల పటిష్టతకు డి విటమిన్ vitamin D చాలా కీలకం.
అయితే దేశంలో చాలా మంది దీని లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధ పడుతున్నారు. విటమిన్ డి పై అవగాహన కల్పించడంతో పాటు లోపం నియంత్రణకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్లో భారతదేశం భారీ ముప్పును ఎదుర్కునే అవకాశం ఉంది.
Vitamin D | అన్ని వర్గాల్లో..
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని ఏజ్ గ్రూపుల age groups వారు విటమిన్ డి డెఫిసియెన్సీతో ఇబ్బంది పడుతున్నారు. ఆ రంగం ఈ రంగం అనే బేధం లేకుండా అన్ని రంగాల all sectors వారిని ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా సూర్యకాంతికి sunlight దూరంగా ఇన్ డోర్లో వర్క్ చేసే వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
Vitamin D | ఎందుకు అవసరం..
విటమిన్ డి లోపంతో Vitamin D deficiency కండరాల బలహీనత muscle weakness, ఊరికే అలసిపోవడం, ఒత్తిడికి లోనవడం వంటి రుగ్మతలు తలెత్తుతాయి. ఇది తక్కువగా ఉంటే ఎముకలు మెత్తగా మారుతాయి. దీంతో పాటు విటమిన్ డి తక్కువగా ఉంటే హర్ట్ ఎటాక్ heart attack, మధుమేహం, క్యాన్సర్ cancer సైతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Vitamin D | కారణం ఏమిటీ!
మారిన జీవన శైలీ విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం. సూర్యకాంతి sunlight నుంచి విటమిన్ డి శరీరానికి లభిస్తుంది. ఉదయం పూట కాసేపు ఎండలో తిరిగితే విటమిన్ డి వస్తుంది. అయితే నగరాల్లో చాలా మంది సూర్యకాంతి మీద పడకుండా బతికేస్తున్నారు. దీనికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం healthy diet తీసుకోకపోవడంతో విటమిన్ డి లోపం వస్తోంది.
Vitamin D | ఏం చేయాలి
డి విటమిన్ కోసం ఉదయం పూట కాసేపు ఎండలో నడవాలి. చేపలు fish, గుడ్లు eggs మరియు బలవర్థకమైన పాలు milk వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని vitamin D foods తీసుకోవాలి. ఇప్పటికే లోపంతో ఉన్నవారు వైద్యులను సంప్రదించి consult a doctor విటమిన్ డి ట్యాబ్లెట్లు వేసుకోవాలి.