అక్షరటుడే, కామారెడ్డి: తెయూ అభివృద్ధి కోసం అధ్యయనం చేసి క్యాంపస్‌ను మరింత పరిష్టపర్చాలని తెయూ డాక్టరేట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వీసీ యాదగిరిరావును కోరారు. సోమవారం అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో వీసీని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో వర్సిటీలో అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.