అక్షరటుడే, ఇందూరు: విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్ లపై విచారణ జరిపించాలని ఉపాధ్యాయ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత డీఈవో ఏఎంవో పోస్టును అక్రమంగా డిప్యుటేషన్ వేయడం, ఎస్ఈఏఎస్ పరీక్ష కోసం నిధుల విడుదలకు చివరి రోజు సంతకాలు పెట్టారన్నారు. అలాగే గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇకనైనా సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు.