అక్షరటుడే, ఎల్లారెడ్డి : మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. లింగంపేట మండలం మెంగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటైన మత్స్య సహకార సంఘానికి సభ్యత్వ ఆర్డర్ కాపీని, గుర్తింపు కార్డులను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని, మత్స్యకారులకు వందశాతం రాయితీపై చేప పిల్లలను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార అధికారి శ్రీపతి, మత్స్య సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.