అక్షరటుడే, బాన్సువాడ: అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం(ఏఐపీఎస్‌యూ) బాన్సువాడ డివిజన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది. పట్టణంలోని భారతరత్న జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.శశి కుమార్, కార్యదర్శిగా మూడ్ వినోద్, కార్యవర్గ సభ్యులుగా మోహన్ సాయి, నితీష్, గణేష్, అనిల్, కృష్ణ తదితరులు ఎన్నికయ్యారు.