అక్షరటుడే, బాన్సువాడ: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని తాడ్కోల్ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. డబుల్ బెడ్ రూం కాలనీకి వెళ్లే దారిలో పదో నంబర్ డిస్ట్రిబ్యూటరీ కాలువకు ఆదివారం రాత్రి గండి పడడంతో భారీగా నీరు వృథాగా పోతోంది. దీంతో కల్వర్టు కూలిపోయే స్థితికి చేరుకుంది. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.