అక్షర టుడే కామారెడ్డి : బీబీపేటలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల వసతి గృహంలో 430 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంతి గదులు, క్రీడా ప్రాంగణం తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.