అక్షరటుడే, వెబ్డెస్క్ : Jagga Reddy | కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీలో ఇప్పుడు తన అవసరం లేదన్నారు. ఢిల్లీ(Delhi) టూర్ తనను పూర్తిగా మార్చేసిందన్నారు. దీంతోనే తాను సినిమా(Cinema)ల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. సినిమాకు తన రాజకీయానికి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉగాదికి తన సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్(Congress) అధికారంలో ఉండటంతో సంగారెడ్డి (Sangareddy) అభివృద్ధికి నిధులు తీసుకు రావడానికి కృషి చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Jagga Reddy | పాన్ ఇండియా మూవీ
రాజకీయాల్లో తనదైన శైలితో ప్రజల మన్ననలు పొందిన జగ్గారెడ్డి సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. జగ్గారెడ్డి.. ‘ఏ వార్ ఆఫ్ లవ్’ అనే సినిమాతో తన నిజ జీవిత పాత్రను పోషించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలిసింది. తన విద్యార్థి జీవితం, రాజకీయ అరంగేట్రం తదితర విషయాలు సినిమాలో ఉంటాయని జగ్గారెడ్డి తెలిపారు. ఈ ఉగాదికి సినిమా చిత్రీకరణ మొదలు పెట్టి వచ్చే ఉగాది నాటిని సినిమా విడుదల చేస్తామన్నారు.