బీజేపీ అభ్యర్థినే గెలిపించాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి హైమావతి కోరారు. సోమవారం ఎల్లారెడ్డి టౌన్, గండిమాసానిపేట్‌లో ఎమ్మెల్సీ ఓటర్లతో కలిసి మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్‌ స్థానాల పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడు మర్రి బాలకిషన్, రాజేష్, నర్సింలు, దేవేందర్, గంగాధర్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement