అక్షరటుడే, ఆర్మూర్‌ : నందిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పీడీఎస్‌యూ నాయకులు పోస్టర్లు ఆవిష్కరించారు. అక్టోబర్‌ 24న హైదరాబాద్‌లో పీడీఎస్‌యూ 50వ వసంతాల వేడుకలు నిర్వహించనున్నట్లు ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ప్రిన్స్‌ తెలిపారు. విద్యార్థులు, పీడీఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్, సాయి, అక్షయ్, నిశాంత్, గణేష్, వెంకటేష్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.