అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: పాత డిజైన్ ప్రకారం మంచిప్ప ప్రాజెక్టు పనులు చేపట్టాలని ముంపు గ్రామాల ప్రజలు కోరారు. ప్రాజెక్టు పనుల కోసం శుక్రవారం అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలుపొందక ముందు భూపతిరెడ్డి పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం కోసం మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు 0.37 టీఎంసీల కెపాసిటీతోనే ప్రాజెక్టు నిర్మించాలని కోరారు.