అక్షరటుడే, కామారెడ్డిటౌన్: సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి కల్లు దుకాణం సమీపంలో శేఖర్ అనే వ్యక్తి ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకునే అతను తరచూ సెల్ఫోన్లను దొంగిలించి తీసుకువచ్చి ఇంట్లో దాచి పెట్టాడు. అతడిపై అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకొని అడగగా ఫోన్లు దొంగతనం చేసినట్లు చెప్పాడు. చోరీ చేసిన మొబైల్ ఫోన్లను చూపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడి వద్ద సుమారు 20 నుంచి 30 ఫోన్లు లభ్యమైనట్లు సమాచారం. సుమారు ఒక్కో ఫోన్ విలువ రూ. 40 వేల నుంచి రూ. 50 వేలు ఉంటుందని తెలిసింది. అయితే శేఖర్ సెల్ఫోన్లే కాకుండా ఇతర దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్లు సమాచారం.