అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం : దోమకొండ మండల కేంద్రం శివారులో సోమవారం పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. జూదరుల వద్ద నుంచి 11,900 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Advertisement
Advertisement