అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్‌లోని జీజీహెచ్‌లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. మద్నూర్‌కు చెందిన పిట్ల రాజు, లక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో నిద్రించగా వారి కుమారుడు మణికంఠను ముగ్గురు మహిళలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు మహారాష్ట్ర వెళ్ళినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని పట్టుకున్నారు.