అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఆరేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తిపై ఓ భూమి వివాదంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం ఓ భూవివాదంలో నలుగురిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన విఠల్ అనే వ్యక్తి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎలాంటి విచారణ లేకుండా పోలీసులు ఎలా ఎఫ్‌ఐఆర్‌ఐ నమోదు చేస్తారని మృతుని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.