అక్షరటుడే, వెబ్‌డెస్క్: నగరంలోని మూడో టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూడో టౌన్ పరిధిలోని ఫ్లైఓవర్ పక్కన ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్ సీఐ అంజయ్య, సిబ్బంది దాడిచేశారు. ఈ సమయంలో పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేయగా మరో ఐదుగురు పరారయ్యారు. వీరివద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు, 19,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని మూడో టౌన్ ఎస్ హెచ్వోకు అప్పగించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Advertisement