అక్షరటుడే, జుక్కల్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. వీరిలో మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పిట్లం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి దాడిచేశారు. ఈ సమయంలో పేకాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని.. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా నగదుతో పాటు ఐదు కార్లు, ఒక బైకు, పది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిపై కేసు నమోదు చేసినట్లు పిట్లం ఎస్సై రాజు తెలిపారు. వీరిలో ఒకరు మాజీ ఎంపీపీ, మరొకరు మాజీ ఎంపీపీ భర్త, మాజీ సర్పంచ్, రిటైర్డ్ ఉన్నతాధికారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులున్నట్లు తెలిసింది.
పేకాట స్థావరంపై దాడి.. మాజీ ప్రజాప్రతినిధుల అరెస్టు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement