అక్షరటుడే, వెబ్‌డెస్క్: Expensive Pet Dog | ఇటీవల సోషల్ మీడియాలో social media ఓ కుక్క గురించి తెగ వైరల్ Viral అయ్యింది. రూ.50 కోట్ల శునకం అంటూ మీడియా, సోషల్ మీడియాలో social media కథనాలు వచ్చాయి. ప్రపంచంలోనే ఇది అత్యంత కాస్ట్లీ డాగ్ అంటూ ప్రచారం సాగింది. బెంగళూరుకు Bangalore చెందిన ఓ వ్యక్తి హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్‌ను hybrid wolf dog కొనుగోలు చేశాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాగా.. ఈ శునకం అంత ఖరీదైన expensive కుక్క లేదని.. సదరు వ్యక్తి ఫేక్ ప్రచారం చేశాడని తెలుస్తోంది.
రూ.50 కోట్ల వోల్ప్ డాగ్ wolfdog అంతా కట్టు కథగా తేలింది. అరుదైన జాతి కుక్కనపు కొనుగోలు చేసిన వ్యక్తి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు Enforcement Directorate officials నిర్వహించారు. బెంగళూరులోని Bengaluru బన్నేర్‌ఘట్ట రోడ్డులో Bannerghatta Road గల ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అయితే అతడు చెప్పిందంతా అబద్ధమేనని ఈడీ గుర్తించింది.
అత్యంత ఖరీదైన కుక్క most expensive dog జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయజాతి కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ED officials గుర్తించారు. ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట ప్రజలను మోసం చేస్తున్నాడని తెలుసుకున్నారు. అయితే ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీలాండరింగ్ కు పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు Enforcement officials దర్యాప్తు చేస్తున్నారు.