అక్షరటుడే, ఇందూరు: సాధారణంగా ఒక సైకిల్ విలువ ఎక్కువలో ఎక్కువ రూ. లక్షో.. రెండు లక్షలో ఉంటుందనుకుంటాం. కానీ ఈ సైకిల్ మాత్రం చాలా కాస్లీ అండోయ్..! జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సౌత్ జోన్ ఉమెన్స్ సైక్లింగ్ పోటీల్లో ఓ సైకిల్ హల్ చల్ చేస్తుంది. కర్ణాటక జట్టుకు చెందిన ఈ సైకిల్ ధర అక్షరాలా రూ. 12.5 లక్షలు. ఇది కేవలం 8 కిలోల బరువు, ఎలక్ట్రిక్ గేర్ సిస్టంతో ఉంటుంది. క్రీడాకారుల కెపాసిటీ ఆధారంగా 80 స్పీడ్ లో వెళ్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘టూర్ ది ఫ్రాన్స్’ సైక్లింగ్ పోటీల్లో క్రీడాకారులు(పినరెల్లో డోగ్మా ఎఫ్) ఈ కంపెనీకి చెందిన సైకిళ్లను వాడతారు.