అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలోకి శ్రీరాముడు కొలువైన వేళ వచ్చిన తొలి దీపావళి ఇది అని, ఈ ప్రత్యేక సమయానికి మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రోజ్‌గార్‌ మేళాలో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ధనత్రయోదశి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు 51 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో రోజ్‌గార్‌ మేళాలను నిర్వహించి వివిధ మంత్రిత్వ శాఖల్లో నియామకాలను చేపట్టారు. ఈ ఉద్యోగాల్లో కొత్తగా చేరిన వారందరికి ‘కర్మయోగా ప్రారంభ్‌’ విధానం కింద శిక్షణ ఇస్తున్నారు. వైజాగ్‌ వీఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో కేంద్రమంత్రి బండిసంజయ్‌ పాల్గొనగా.. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Tempature | రెండు రోజులు దంచికొట్టనున్న ఎండలు