అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు బుధవారం విద్యార్థుల ఇళ్లకు వెళ్లారు. పిల్లలను కళాశాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గంగారం మాట్లాడుతూ.. కొందరు విద్యార్థులు కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి.. కాలేజీకి రావడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థులు కళాశాలకు వచ్చే విధంగా చూడాలని, ఈనెల 18 నుంచి అర్థవార్షిక పరీక్షలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు లక్ష్మణ్, రాజగోపాల్, వెంకటస్వామి తదితరులు ఉన్నారు.