అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు సోమవారం నుంచి నిరవధిక బంద్‌ పాటిస్తున్నాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల సంఘం అధ్యక్ష కార్యదర్శులు హరిప్రసాద్‌, సంజయ్‌ తెలిపారు. ఇప్పటికే వర్సిటీ అధికారులకు నిరసన నోటీసులు అందజేమన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బంద్‌ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16న నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు.