అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కాలేజీ యాజమాన్యాలు, సిబ్బంది పాల్గొని నిరసన తెలిపారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని కార్యక్రమ సమన్వయకర్త నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కళాశాలల అడ్వైజర్ అరుణ్ కుమార్, మాజీ కార్యదర్శి సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.