అక్షరటుడే, వెబ్‌డెస్క్ : రైల్వే శాఖ పోస్టుల భర్తీలో కీలక నిర్ణయం తీసుకుంది. తమశాఖలో రిటైర్డ్ ఉద్యోగులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. కానీ 65 ఏళ్లలోపు వారే అర్హులని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆయా జోన్లలో 25వేల ఉద్యోగాలకు రైల్వే శాఖ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 65ఏళ్లలోపు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా అవకాశమిచ్చింది. అయితే వారిని రెండేళ్ల పదవీకాలానికి మాత్రమే తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ పొడిగించనున్నట్లు తెలిసింది.