Advertisement

అక్షరటుడే, ఇందూరు: రైల్వే స్టేషన్లో ప్రయాణికుడి నుంచి సెల్ ఫోన్ ను తస్కరించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన మహేష్ నిజామాబాద్ కు పని మీద వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో రైల్వేస్టేషన్ లో ఫోన్ చోరీకి గురైంది. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్లాట్ ఫామ్-1 పై అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు రాములు, శ్రీకాంత్ పట్టుకొని విచారించారు. సదరు వ్యక్తి వద్ద సెల్ ఫోన్ లభించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వినయ్ కుమార్, నవీపేట్ వాసిగా గుర్తించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Collector : తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు