అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ అలుగు పారుతోంది. ప్రాజెక్టుకి ఎగువ నుంచి 10,295 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో అలుగు ద్వారా దిగువకు వెళ్తోంది. దీంతో ప్రాజెక్ట్ దిగువనగల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.