అక్షరటుడే, వెబ్ డెస్క్: Dichpally | ఎస్సీ వర్గీకరణ నివేదికను తక్షణమే సవరించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు డప్పులతో ర్యాలీగా వెళ్లారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీలను ఏబీసీడీగా వర్గీకరించాలని పోరాడుతుంటే, డాక్టర్ షమీం అక్తర్ ఏబీసీ అని నివేదిక ఇచ్చారన్నారు. దీన్ని సవరించి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగభూషణం, మండల ఇన్‌ఛార్జి నర్సయ్య, సంఘం కిష్టయ్య, సత్య అక్క, యమున తదితరులు పాల్గొన్నారు.