అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రేపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను 4.5 శాతం నుంచి 4.8 శాతానికి పెంచారు. క్యాష్ రిజర్వు రేషియోను 4.5 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించారు. దీంతో బ్యాంకుల వద్ద 1.16 లక్షల కోట్ల నగదు అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయ రంగంలో తాకట్టు లేని రుణాల పరిమితిని రూ.2 లక్షల పెంచారు.