అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా విశ్వవిద్యాలయాల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://consortiumofnlus.ac.in/clat2025/view-result.html లో తమ అడ్మిట్ కార్డు, అప్లికేషన్ నంబర్ వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను డిసెంబర్ 9న ప్రకటించనున్నారు.