అక్షరటుడే, వెబ్‌డెస్క్: రైతులు ఎరువుల కోసం చెప్పులను క్యూలైన్‌లో ఉంచారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో డీఏపీ ఎరువు కొరత నెలకొంది. దీంతో రైతులు సోమవారం ఉదయం నుంచి గోదాం వద్ద వేచి ఉన్నారు. ముధోల్ పీఏసీఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.