Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి, ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి నోటిఫికేషన్​ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Mlc candidates | ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..