అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకేదశలో ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. అక్టోబర్‌ 22న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నవంబర్‌ 20న పోలింగ్‌ జరగనుంది. అలాగే జార్ఖండ్‌ లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నవంబర్‌ 13, 20 తేదీల్లో పోలింగ్‌ జరుగనుంది. కాగా.. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 23న వెలువడుతాయని కమిషనర్ తెలిపారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్‌ 26న మహారాష్ట్ర అసెంబ్లీ, 2025 జనవరి 5తో జార్ఖండ్‌ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.