అక్షరటుడే, కామారెడ్డి: Gampa Govardhan | వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి(Elkaturthi)లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration)ను విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Govardhan) పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో సన్నాహక సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం(Constituency) నుండి 3 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించామన్నారు.
27న ప్రతి గ్రామంలో పార్టీ జెండా(Party flags)లను ఆవిష్కరించి సభకు బయలుదేరాలని సూచించారు. రజతోత్సవ సభను పండుగలాగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 1500 ఎకరాల్లో చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న సభను సక్సెస్(Success) చేసేందుకు ప్రతిఒక్క బీఆర్ఎస్(BRS) కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) తదితరులు పాల్గొన్నారు.