అక్షరటుడే, వెబ్‌డెస్క్: జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో కీచులాటలు నివురుగప్పిన నిప్పులా మారాయి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటానని తాజాగా ఎమ్మెల్యే సంజయ్ పేర్కొనడంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వర్గంలో ఆగ్రహాలు కట్టలు తెంచుకున్నాయి. ఇప్పటికే సంజయ్‌పై గుర్రుగా ఉన్న జీవన్‌రెడ్డి వర్గం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కుమ్ములాటలు మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డితో సంజయ్ వాగ్వాదం కూడా జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్‌గా మారుతుందా అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Advertisement
Advertisement