అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఫారెస్టు అధికారులపై దాడి చేయడం సరికాదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అటవీశాఖ ఎఫ్‌ఆర్‌వో రవిమోహన్ భట్, జేఎఫ్‌వోఏ నిజామాబాద్ అధ్యక్షుడు సుధాకర్‌రావు తెలిపారు. కాల్పోల్‌లో ఫారెస్టు అధికారులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో సంఫీుభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. అటవీ భూముల్లో చెట్లు నరికేసి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కొందరు నాయకులు రెచ్చగొడుతుండడం వల్లే ప్రజలు ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది సరైన చర్యకాదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి ఫారెస్టు అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో పద్మారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.